భారతదేశం, అక్టోబర్ 11 -- ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ మొదలైంది. ఈ పండుగ సీజన్‌లో స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా పండగే! 'బిగ్ బిలియన్ డేస్'లో బెస్ట్ ఆఫర్లను మిస్ అయిన వారికి, మంచి ధరలకు స్మార్ట్‌ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఇది మరో సువర్ణావకాశం! ఈ సేల్‌లో శాంసంగ్, గూగుల్ సహా పలు కంపెనీల మోడల్స్‌పై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఆ వివరాలు కింద చూడండి..

శాంసంగ్ గెలాక్సీ S24 మోడల్‌ ఇప్పుడు కొత్త చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి, ఒరిజినల్​గా S24 లో ఎక్సీనోస్ 2400 చిప్‌సెట్ ఉండేది. కానీ, ఇప్పుడు స్నాప్‌డ్రాగన్ 8 జెన్​ 3 చిప్‌తో వచ్చిన ఈ ఫోన్, పాత దాని కంటే అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

బేస్ మోడల్ (128GB + 8GB) ధర రూ. 39,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లను జోడిస్తే, ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.

తరువాత చెప్పుకోవా...