భారతదేశం, నవంబర్ 8 -- ప్రతి ఏటా దీపావళి పర్వదినాన్ని ఎంతో ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటాం. అయితే ఈసారి వచ్చే దీపావళి మాత్రం జ్యోతిష్య శాస్త్ర పరంగా అత్యంత విశేషమైనదిగా నిలుస్తోంది. సరిగ్గా 71 ఏళ్ల తర్వాత దీపావళి వేళ అద్భుతమైన రెండు రాజయోగాల కలయిక ఏర్పడుతోంది. బుధుడు, సూర్యుడు, శుక్రుడి సంచారం వల్ల ఏర్పడుతున్న ఈ అరుదైన యోగాలు దేశవ్యాప్తంగా పలు రాశుల వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపనున్నాయి.

ఈ దీపావళి రోజున సూర్య, బుధుల కలయిక వల్ల 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతోంది. దీనివల్ల సృజనాత్మకత పెరుగుతుంది, అనుకున్న రంగాలలో రాణించడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మరోవైపు, బుధ, శుక్రుల కలయికతో 'లక్ష్మీ నారాయణ రాజయోగం' సిద్ధిస్తోంది. వ్యాపారం, బుద్ధికికారకుడైన బుధుడు.. భోగభాగ్యాలు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు ఒక్కచోట చేరడం వల్ల ఆర్థిక వృద్ధి...