భారతదేశం, ఆగస్టు 5 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తమ కొత్త కే13 టర్బో సిరీస్‌ను ఆగస్టు 11న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఇందులో కే13 టర్బో, కే13 టర్బో ప్రో అనే రెండు వేరియంట్లు ఉండనున్నాయి. ఈ ఫోన్లు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభిస్తాయి. ఈ స్మార్ట్​ఫోన్స్​ ప్రత్యేకత ఏమిటంటే.. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వీటిలో ఇన్-బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి.

ఒప్పో ధృవీకరించిన వివరాల ప్రకారం.. కే13 టర్బో ప్రోలో 'టర్బో బ్రీతింగ్ లైట్' అనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. దీనిలో కెమెరా చుట్టూ రెండు మిస్ట్ షాడో ఎల్‌ఈడీలు, ఎనిమిది రంగుల ఆర్‌జీబీ లైటింగ్‌ను చూడవచ్చు.

ఇక కే13 టర్బో మోడల్‌లో 'టర్బో లూమినస్ రింగ్' అ...