భారతదేశం, ఆగస్టు 24 -- రియల్​మీ సంస్థ నుంచి మరో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ఇటీవలే ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. దాని పేరు రియల్​మీ పీ4 ప్రో. పీ4 సిరీస్​లో ఇది భాగం. కాంపిటీటివ్​ ధరలో అగ్రశ్రేణి స్పెసిఫికేషన్లతో వచ్చిన పీ4 ప్రో 5జీ.. రూ. 30,000 లోపు ప్రీమియం పనితీరును కోరుకునే వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

భారతదేశంలో రియల్‌మీ పీ4 ప్రో 5జీ మూడు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది:

రియల్‌మీ పీ4 ప్రో 5జీ (8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) ధర: రూ. 24,999

రియల్‌మీ పీ4 ప్రో 5జీ (8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్) ధర: రూ. 26,999

రియల్‌మీ పీ4 ప్రో 5జీ (12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్) ధర: రూ. 28,999

ఈ ఫోన్ ఆగస్ట్​ 27, 2025 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్...