భారతదేశం, జూన్ 17 -- ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ​ సంస్థ పోకో నుంచి కొత్త గ్యాడ్జెట్​ ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతోంది. దాని పేరు పోకో ఎఫ్​7. 7,550 ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉండటం హైలైట్​! ఈ పర్ఫార్మెన్స్​ ఓరియెంటెడ్​ స్మార్ట్​ఫోన్​ ఈ నెల 24న ఇండియాలో అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్లు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పోకో ఎఫ్​7కి సంబంధించి, ఫ్లిప్​కార్ట్​లో ఒక ప్రమోషనల్​ పేజ్​ యాక్టివ్​ అయ్యింది. దాని ద్వారా పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ స్మార్ట్​ఫోన్​ భారీ 7,550 ఎంఏహెచ్​ బ్యాటరీని కలిగి ఉంటుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది సిలికాన్-కార్బన్ బ్యాటరీ అని ఫ్లిప్‌కార్ట్ ధృవీకరించింది. అందుకే సాధారణ 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ కంటే దాదాపు 50 శాతం ఎక్కువ సామర్థ్యాన్ని అందిస్తుంది.

అంతేకాకుండా, ఈ పోకో ఎఫ్​7తో ఫుల...