భారతదేశం, ఆగస్టు 17 -- వివో తన మిడ్-రేంజ్ టీ సిరీస్​లో మరో కొత్త డివైజ్‌ను విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. వివో టీ4 ప్రో పేరుతో రానున్న ఈ కొత్త ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఇప్పటికే వివో భారతదేశంలో వివో టీ4 అల్ట్రాను రూ. 37,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. వివో టీ4 ప్రో దాని కంటే తక్కువ శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర సుమారు రూ. 30,000 మార్క్‌లో ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గతంలో వచ్చిన వివో టీ3 ప్రో కూడా ఇదే ధర పరిధిలో ప్రారంభమైంది. ఆ మోడల్‌లోని 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా.. 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 26,999గా ఉండేది.

వివో టీ4 ప్రో లాంచ్ తేదీని వివో ఇంకా ప్రకటించనప్పట...