భారతదేశం, జూన్ 16 -- ఐక్యూ సంస్థ నుంచి ఒక కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ లాంచ్​కు రెడీ అవుతోంది. దాని పేరూ ఐక్యూ జెడ్​10 లైట్​. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. ఈ ఫోన్​ జూన్​ 18న ఇండియాలో లాంచ్​ అవుతుందని ఐక్యూ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. లాంచ్​ తర్వాత ఈ ఐక్యూ జెడ్​10 లైట్​.. ఇప్పటికే అందుబాటులో ఉన్న జెడ్​10, జెడ్​10ఎక్స్​ మోడల్స్​తో కూడిన జెడ్​10 సిరీస్​లో చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Z10 లైట్ 5Gలో 6,000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుందని, ఇది దాని విభాగంలోనే అతిపెద్దదని ఐక్యూ ఒక సోషల్​ మీడియా పోస్ట్​ ద్వారా వెల్లడించింది. అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ కోసం ఒక మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఇది ప్లాట్‌ఫామ్‌లో స్మార్ట్​ఫోన్​ లభ్యతను ధృవీకరిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,000 లోపు ఉం...