భారతదేశం, అక్టోబర్ 1 -- పవన్ కల్యాణ్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ 'ఓజీ' మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలకడ కొనసాగిస్తోంది. ఈ సినిమా ఆరు రోజుల్లో ఇండియాలో రూ.150 కోట్ల కలెక్షన్లను దాటింది. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఆరు రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి.

పవన్ కల్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన ఓజీ మూవీ ఆరో రోజైన మంగళవారం (సెప్టెంబర్ 30) ఇండియాలో రూ.6.7 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. దీంతో మూవీ ఆరు రోజుల్లో కలిపి ఇండియాలో రూ.154 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఓజీ ఫస్ట్ డే రూ.63.75 కోట్లతో గ్రాండ్ ఓపెనింగ్ సొంతం చేసుకుంది. అంతకుముందు పెయిడ్ ప్రీమియర్లతో రూ.21 కోట్లు దక్కించుకుంది.

ఓజీ మూవీ సెకండ్ డే కలెక్షన్లు 71 శాతం తగ్గాయి. రూ.18.45 కోట్లు వసూలయ్యాయి. వీకెండ్ లో శని, ఆద...