భారతదేశం, డిసెంబర్ 25 -- రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' (Dhurandhar) మూవీ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది. అయితే ఇంత పెద్ద హిట్‌ను ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరూ మెచ్చుకోకపోవడంపై రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించాడు. ఈ సినిమా మిగతా నిర్మాతలకు ఒక భయం కలిగించే కుక్కలా మారిందని, పాత ఫార్ములా నమ్ముకున్న వాళ్లకు ఇదొక పీడకల అని వర్మ విశ్లేషించాడు.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నా.. ఇండస్ట్రీ నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. దీనికి గల కారణాలను ఆర్జీవీ ఎక్స్ వేదికగా పూసగుచ్చినట్టు వివరించాడు. వర్మ ఈ సినిమా ప్రభావాన్ని వివరిస్తూ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాడు.

"మనం ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు.. అక్కడ ఒక భారీ కుక్క మనల్నే చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఓనర్ అది 'ఏం చేయదులే' అని ...