భారతదేశం, జూలై 21 -- శాంసంగ్​ నుంచి రూ. 20వేల బడ్జెట్​లోపు సెగ్మెంట్​లో కొత్త స్మార్ట్​ఫోన్​ తాజాగా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పేరు శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​36. ఇది సంస్థకు సక్సెస్​ని ఇచ్చిన ఎఫ్​ సిరీస్​లో భాగం. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. ఇందులో అనేక ఏఐ ఫీచర్స్​ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​కి చెందిన పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.

శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​36లో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.7 ఇంచ్​ సూపర్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. దీనికి కార్నరింగ్​ గొరిల్లా గ్లాస్​ విక్టర్​+ ప్రొటెక్షన్​ లభిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో ఆక్టా-కోర్​ ఎక్సినోస్​ 1380 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంటుంది. ఇది మాలీ-జీ68 ఎంపీ5 జీపీయూతో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ ఫోన్​లో థర్మల్​ మేనేజ్​మెంట్​ కోసం ప్రత్యేక ఛాంబర్​ కూడా ఉంది. 8జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​...