భారతదేశం, జూలై 27 -- వివో తన సరికొత్త టీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ అయిన వివో టీ45 5జీని ఈ నెల 31 మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మిడ్​ రేంజ్​ స్మార్ట్‌ఫోన్​ విభాగంలో వివో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ ఫోన్ దోహదపడుతుందని భావిస్తోంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ఇంటర్నల్​ ఫీచర్లతో పాటు పోటీ ధరలో ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ను వివో విడుదల చేయనుంది. పనితీరుతో పాటు ఆకర్షణీయమైన డిజైన్ కోరుకునే వినియోగదారులను ఇది ఆకట్టుకుంటుందని అంచనా. ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో టీ45 5జీ ముఖ్య ఆకర్షణల్లో ఒకటి క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే. సాధారణంగా ప్రీమియం ఫోన్‌లలో కనిపించే ఈ డిజైన్ ఫీచర్, ఈ ఫోన్‌కు సొగసైన, ఆధునిక రూపాన్ని ఇస్తుంది. స్క్రీన్ నాలుగు అంచుల నుంచి సజావుగా వంగి ఉంటుంది. టీజర్‌ల ప్రకారం...