భారతదేశం, ఆగస్టు 20 -- విజయవాడలో కేవలం 5 నెలల పసికందుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడికి ఈ అరుదైన ఆపరేషన్ సాధ్యమైంది. గడిచిన మూడేళ్ళలో ఈ ప్రోగ్రామ్ ద్వారా 10 మందికి పైగా పిల్లలకు మణిపాల్ హాస్పిటల్‌లో లివర్ మార్పిడి జరిగి, 90 శాతానికి పైగా విజయవంతం అయ్యాయి.

ఈ సందర్భంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మాట్లాడుతూ.. 'పిల్లల్లో లివర్ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు, సర్జరీ ఒక్క విషయంలోనే కాదు, లివర్ అనస్తీషియా, పిల్లల ఇంటెన్సివ్ కేర్ ఇలా అన్నిట్లోనూ అత్యంత నైపుణ్యం కావాలి. అన్నీ సమన్వయం చేసుకోవాలి. దేశంలో ఇలాంటి సెంటర్లు 5-7 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కూడా వాటిలో ఒకటిగా నిలిచింది.' అని చెరియన్ అన్నారు.

ఏడేళ్ల క్రితమే హైదరాబాద్‌లో అతి పిన్న వయసు గ...