భారతదేశం, ఆగస్టు 10 -- మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నారా? సాధారణంగా మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టే ముందు సదరు ప్రాడక్ట్​ గత ప్రదర్శనను చూస్తుంటారు. భవిష్యత్తులో దాని పనితీరుని అంచనా వేసేందుకు ఇలా చేస్తారు. ఈ నేపథ్యంలో వార్షికంగా 30 శాతం రాబడి ఇచ్చిన టాప్ 10 స్మాల్​క్యాప్ మ్యూచువల్ ఫండ్స్​ వివరాలను ఇక్కడ చూద్దాము.

తమ మొత్తం పెట్టుబడుల్లో 65 శాతం స్మాల్​క్యాప్ స్టాక్స్​లో, మిగతా వాటిని మిడ్-క్యాప్ లేదా లార్జ్-క్యాప్ స్టాక్స్​లో పెట్టుబడి పెట్టే ఫండ్స్​ని స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. జూన్ 30, 2025 నాటికి, మొత్తం 30 స్మాల్-క్యాప్ పథకాలు ఉండగా, వాటి మొత్తం ఆస్తుల నిర్వహణ (ఏయూఎం) విలువ రూ. 3,54,550 కోట్లు.

కింద పట్టికలో చూసినట్లుగా.. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ సుమారు 33 శాతం వార్షిక రాబడిని ఇవ్వగా, హె...