భారతదేశం, జూన్ 20 -- ఇంధన ధరలు తగ్గించుకునేందుకు చూస్తున్న మిడిల్​ క్లాస్​ వాహనదారులకు అలర్ట్​! 330 కి.మీ వరకు మైలేజ్​ ఇచ్చే ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్‌పై తగ్గింపును ప్రకటించింది బజాజ్​ ఆటో. ఈ ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్​పై రూ. 5వేలు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో బజాజ్​ ఫ్రీడమ్​ 125 గురించి, ధర తగ్గింపు గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బజాజ్​ ఫ్రీడమ్​ 125 సీఎన్జీ ఎక్స్​షోరూం ధర రూ. 90,270 నుంచి రూ. 1.10లక్షల వరకు ఉంటుంది. కాగా ఫ్రీడమ్​ 125 సీఎన్జీ బైక్​ ధరను తగ్గిస్తున్నట్టు కంపెనీ సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే, ఈ ధర తగ్గింపు NG04 డ్రమ్ వేరియంట్ (బేస్ వేరియంట్)కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. ఇది శాశ్వత ధర తగ్గింపు కాదని, ఈ డిస్కౌంట్ ఆఫర్ కొంతకాలం తర్వాత ముగుస్తుందని బజాజ్ స్పష్టం చేసింది.

ఫ్రీడమ్ 125 స...