Hyderabad, జూన్ 24 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో మరో రాశితో కూడా సంయోగం చెందుతూ ఉంటాయి. గ్రహాల సంయోగం చెందినప్పుడు శుభ, అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, వాటి పరస్పర కలయిక పెద్ద మార్పులను తీసుకువస్తుంది.

జూలై నెలలో శని తిరోగమనం చెందుతాడు. ఈ సమయంలో బుధ గ్రహంతో సంసప్తక రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది చాలా ప్రభావితమైనది. ఈ రాజయోగం 30 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది. ఈ యోగం అన్ని రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది. ఈ సమయాన్ని శుభప్రదంగా భావిస్తారు. అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది.

ఈ అరుగైన రాజయోగం ఆకస్మిక ధన లాభం, వృత్తిలో పురోగతి, వ్యాపారంలో లాభాలు వంటి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. శని-బుధ గ్రహాల కలయిక జీవితంలో పురోగతికి సువర్ణవకా...