Hyderabad, జూలై 22 -- తమిళంతోపాటు తెలుగులోనూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ నటించిన మూవీ 3 బీహెచ్‌కే. ఇదో కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా. జులై 4న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో తమ్ముడు రిలీజైన రోజే వచ్చినా.. ఆ సినిమా కంటే పాజిటివ్ టాక్ తో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

తమిళంతోపాటు తెలుగులోనూ ఈ 3 బీహెచ్‌కే సినిమా రిలీజైంది. జులై 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఆగస్ట్ 4 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేదు. దీంతో నెల రోజుల్లో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. సిద్ధార...