Hyderabad, జూన్ 30 -- టాలీవుడ్‌లో జెట్టి సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణ మానినేని సేవా దృక్పథంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. 100 డ్రీమ్స్ సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలను గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిగా విజయవాడ వరదల సమయంలో హీరో కృష్ణ మానినేని చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి. 100 డ్రీమ్స్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు కృష్ణ మానినేని జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డేను పురస్కరించుకొని "సింధూర సంజీవని" పేరిట ఇవాళ (జూన్ 30) రక్తదాన శిబిరం నిర్వహించారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో 251 మంది దాతలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు హీరో మానినేని కృష్ణ. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు స్వామి నాయుడు, 100 డ్రీమ్స్ వాలంటీర్స్, మ...