భారతదేశం, జూలై 31 -- 2027 Cricket World Cup: ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ (ICC Men's Cricket World Cup 2027) కి సంబంధించిన అత్యంత కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది. సుదీర్ఘమైన 24 ఏళ్ల విరామం తర్వాత ఐసీసీ మెగా ఈవెంట్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి రానుంది. ఈ టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి.

2027 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చే స్టేడియాల లిస్ట్ ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. మొత్తం 12 మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నట్లు జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఐసీసీ చైర్మన్ జై షా ప్రకటించారు.

ఈ వేడుకలో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాలు గ్రేమ్ స్మిత్, మఖాయా ఎన్తిని, హషీమ్ ఆమ్లా, తెంబా బావుమా, కాగిసో రబాడాతో పాటు జింబాబ...