భారతదేశం, నవంబర్ 28 -- 2027 సంవత్సరంలో మొత్తం ఐదు గ్రహణాలు ఏర్పడుతున్నాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, మూడు చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఏడాది తొలి గ్రహణం ఫిబ్రవరిలో వస్తుంది. ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలల్లోనూ గ్రహణాలు కనిపిస్తాయి. ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించడం విశేషం. ఆ సమయంలో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పగలే కొద్దిసేపు చీకటి కమ్ముకుంటుంది. భారత్‌లో మాత్రం ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. గ్రహణం ఏ రోజు వస్తుంది, మన దేశంలో కనిపిస్తుందా లేదా, సూతక కాలం ఎప్పుడు మొదలవుతుంది వంటి ప్రశ్నలు అందరిలో మెదులుతుంటాయి. అందుకే కొత్త ఏడాది మొదలుకాకముందే 2027 గ్రహణాల తేదీలు తెలుసుకోవడం ఎంతో అవసరం.

తెలుగు రాష్ట్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాల వేళ ఆలయాలు మూసివేయడం, గ్రహణానంతరం స్నానం, దానధర్మాలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఖగోళ ఆసక్తి ఉన్నవారు, పంచ...