భారతదేశం, ఫిబ్రవరి 16 -- భారత రోడ్లపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రెండు ఐకానిక్ కార్లు ఇప్పుడు సరికొత్త హంగులతో మళ్లీ ప్రజలకు చేరువయ్యాయి. అప్పట్లో రారాజుగా వెలిగిన 'టాటా సియెర్రా' ఇప్పటికే డెలివరీలతో సందడి చేస్తుండగా, ఎంతో మందికి ఇష్టమైన 'డస్టర్'కి సంబంధించిన ధరలను మార్చ్​లో ప్రకటించి, ఏప్రిల్ 2026 నుంచి డెలివరీలను ప్రారంభించనుంది రెనాల్ట్​ సంస్థ. ఈ రెండు కాంపాక్ట్ ఎస్‌యూవీల మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో ఈ పోలిక ద్వారా తెలుసుకోండి..

రెనాల్ట్​ డస్టర్ పొడవులో స్వల్పంగా మెరుగ్గా ఉన్నప్పటికీ, మిగతా అన్ని విషయాల్లో టాటా సియెర్రానే పైచేయి సాధించింది.

పొడవు: డస్టర్ (4346 ఎంఎం)- సియెర్రా కంటే 6 ఎంఎం ఎక్కువ.

వెడల్పు- ఎత్తు: టాటా సియెర్రా 26 ఎంఎం ఎక్కువ వెడల్పు, 12 ఎంఎం ఎక్కువ ఎత్తుతో మంచి రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంది.

వీల్‌బేస్: సియెర్రా వీల్‌బేస...