భారతదేశం, సెప్టెంబర్ 23 -- తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ త్వరలోనే రాబోతోంది. మహిళల ఆత్మీయత, ప్రకృతి ప్రేమ, భక్తి, సాంస్కృతిక వైభవాన్ని బతుకమ్మ చాటుతుంది. 2026లో బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 18 వరకు 9 రోజుల పాటు ఘనంగా జరుపుతారు. ప్రతిరోజూ ప్రత్యేకమైన బతుకమ్మను తయారు చేస్తారు. అలాగే, ఆ రోజుకి తగ్గట్టుగా నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. తరతరాలుగా ఆనవాయితీగా తెలంగాణలో బతుకమ్మను జరుపుతున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ సంప్రదాయంలో ముఖ్యమైన భాగాలే.

అక్టోబర్ 10న ఎంగిలి బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న అటుకుల బతుకమ్మ, మూడవ రోజు అక్టోబర్ 12న ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు అక్టోబర్ 13న నానే బియ్యం బతుకమ్మ, అక్టోబర్ 14న అట్ల బతుకమ్మన...