భారతదేశం, నవంబర్ 26 -- హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి విశేష స్థానం ఉంది. శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఈ రోజున భక్తితో పూజిస్తే కోరిన ఫలాలు దక్కుతాయని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి నెలా రెండు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో ఒకటి కృష్ణ పక్షంలో, మరొకటి శుక్ల పక్షంలో వస్తాయి. 2026 డిసెంబర్ నెలలో రెండు కీలక ఏకాదశులు వచ్చాయి.

వాటిలో మొదటిది ఉత్పన్న ఏకాదశి కాగా, రెండోది మోక్షదా ఏకాదశి. ఈ రెండు ఏకాదశి వ్రతాలను జరపడం శుభప్రదంగా భావిస్తారు. మోక్షదా ఏకాదశి వ్రతం పుణ్యఫలం, మోక్షానికి మార్గం చూపుతుందని నమ్ముతారు. ఈసారి ఈ రెండు ఏకాదశుల వేళ పలు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలు, ఇళ్లలో విష్ణు సహస్రనామ పారాయణాలు, ఉపవాసాలు, తులసి పూజలు నిర్వహిస్తారు. పంచాంగ నియమా...