భారతదేశం, నవంబర్ 4 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో మంచి యోగాలు, చెడ్డ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలని అందిస్తాడు. న్యాయదేవుడు శని 2026 ప్రారంభంలోనే ఒక ముఖ్యమైన సంచారం చేయబోతున్నాడు.

జనవరి 2026లో శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ద్వాదశ రాశులు వారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. జనవరి 2026లో ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని ప్రవేశించబోతున్నాడు. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి సొంత నక్షత్రంలోకి శని ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఎదురవబోతున్నాయి. అయితే శని మళ్లీ మే 17న రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన శని ఏ రాశుల వారికి శుభఫలితాలు తీస...