భారతదేశం, డిసెంబర్ 29 -- గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకొస్తుంది. ఒక్కోసారి రెండు మూడు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. అలాంటప్పుడు జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కొత్త సంవత్సరం అందరూ మంచి జరగాలని, శుభ యోగాలతో ఆనందంగా ఉండాలని అనుకుంటారు.

కొత్త సంవత్సరం మరో రెండు రోజుల్లో మొదలుకాబోతోంది. కొత్త సంవత్సరం 2026లో అద్భుతమైన శుభ యోగాలు మొదలవబోతున్నాయి. లక్ష్మీమాతతో ముడిపడి ఉన్న రాజయోగాలు కూడా జనవరిలో రాబోతున్నాయి. ఈ రాజయోగాలు అనేక లాభాలను కలిగిస్తాయి. ఆర్థిక లాభాలు, కెరీర్‌లో పురోగతి, కుటుంబ ఆనందం ఇలా ఎన్నో.

పంచాంగం ప్రకారం చూసినట్లయితే, జనవరి 26, శుక్రవారం నాడు చంద్రుడు, గురువు ప్రత్యేకమైన యోగాన్ని ఏర్పరచబోతున్నారు. ఈ రెండింటి కలయిక గజకేసరి రాజ...