భారతదేశం, డిసెంబర్ 12 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా ఉన్న సెల్టోస్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని తీసుకొచ్చింది కియా సంస్థ. ఇప్పటికే ఈ 2026 కియా సెల్టోస్ కోసం బుకింగ్‌లను సైతం ప్రారంభించింది. ఫీచర్లు, ఇతర వివరాలను కూడా వెల్లడించింది. దీని ధరను మాత్రం జనవరి 2న ప్రకటించనుంది.

ఈ నేపథ్యంలో న్యూ జెన్​ ఎస్‌యూవీ లాంచ్‌కు ముందు, 2026 కియా సెల్టోస్ టాప్-ఎండ్ ట్రిమ్ జీటీఎక్స్​ (ఏ), హ్యుందాయ్ క్రెటా టాప్-ఎండ్ ట్రిమ్ క్రెటా కింగ్ మోడళ్ల ఫీచర్లను పోల్చి చూద్దాము. ఈ రెండు మోడళ్లతో వినియోగదారులకు ఏం లభిస్తుందో తెలుసుకుందాము..

రెండు ఎస్‌యూవీల టాప్ ట్రిమ్‌లు ఎక్స్​టీరియర్​ ఫీచర్ల పరంగా చాలా పోలికలను కలిగి ఉన్నాయి. అదే సమయంలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి:

ఫాగ్ ల్యాంప్స్: సెల్టోస్‌లో ముందు, వెనుక భాగాల్లో ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. క్రెటాలో ఈ ఫీచర్...