Hyderabad, సెప్టెంబర్ 23 -- నవరాత్రులు సెప్టెంబర్ 22 అంటే నిన్నటి నుంచి మొదలయ్యాయి. తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఆరాధించి అమ్మవారికి నైవేద్యాలని సమర్పిస్తాము.

రెండవ రోజు గాయత్రి రూపంలో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. ఈరోజు గాయత్రీ దేవిని పూజించేటప్పుడు వీటిని తప్పక చదువుకోండి. దీనితో అమ్మ అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండచ్చు.

నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేక్షరీ

అజరే మరే మాతా త్రాహి మాం భవసాగరాత్ (1)

నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికే మలే

బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోస్తు తే (2)

అనంతకోటి బ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ

నిత్యానందే మహామాయే పరేశానీ నమోస్తుతే (3)

త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా

మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః (4)

పూషార్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః

పిత...