Hyderabad, జూన్ 23 -- అటు సినిమాలు, ఇటు ఓటీటీ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా. అయితే, రానా దగ్గుబాటి ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు. రెండేళ్ల క్రితం 2023 మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన రానా నాయుడు తీవ్రమైన నెగెటివిటీ మూటగట్టుకంది.

ఆన్‌లైన్‌లో రానా నాయుడు సిరీస్‌ను తెగ ట్రోలింగ్ చేశారు. ఇక దీనికి సీక్వెల్‌గా రానా నాయుడు సీజన్ 2 ఓటీటీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రానా నాయుడు సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రానా నాయుడు 2 ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దగ్గుబాటి రానా ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడో చెప్పాడు.

మారువేషంలో ఉన్న నిరాశావాదాన్ని (ఇంచుమించు ట్రోలింగ్ లాంటిది) అర్థం చేసుకోడానికి, దాని నుంచి పైకి లేవడానికి తన దగ్గర ఒక లెక్...