భారతదేశం, నవంబర్ 16 -- నటి లక్ష్మీ మంచు తాజాగా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. తాను 15 ఏళ్ల వయసులో, 10వ తరగతిలో ఉన్నప్పుడు తొలిసారిగా లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె వెల్లడించింది. హాటర్ ఫ్లైతో మాట్లాడుతూ నటుడు మోహన్ బాబు కుమార్తెగా తాను చాలా సంరక్షణతో పెరిగానని, అయితే ప్రజా రవాణాలో జరిగిన ఒక అనుభవం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె పేర్కొంది.

ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ తాను 10వ తరగతిలో, కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారిగా వేధింపులకు గురైనట్లు తెలిపింది. మోహన్ బాబు కుమార్తెగా తాను సాధారణంగా డ్రైవర్, బాడీగార్డ్ లేదా తల్లితో పాటు స్కూల్‌కు వెళ్లేదాన్నని ఆమె పేర్కొన్నారు. అయితే ఒకసారి హాల్ టికెట్లు తీసుకోవడానికి స్కూల్ నుంచి వాళ్లను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన బస్ లో తీసుకెళ్లింది. ఆ సమయంలో తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని ఆమె గు...