భారతదేశం, జూలై 6 -- ఇండియాలో 2 వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థలు ఎగబడుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త మోడల్స్​ని కస్టమర్స్​కి పరిచయం చేస్తున్నాయి. వీటిల్లో చౌకైన ధరలతో, మంచి రేంజ్​తో వస్తున్న ఎలక్ట్రిక్​ స్కూటర్లు ప్రజలను మరింత ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హిరో మోటోకార్ప్​కి చెందిన విడా నుంచి కొత్త ఈ-స్కూటర్​ ఇటీవలే మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చింది. దాని పేరు విడా వీఎక్స్​2. ఈ మోడల్​ రేంజ్​, ధరతో పాటు పూర్తి వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..

విడా వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్​కి అఫార్డిబుల్​ వర్షెన్​గా మార్కెట్​లోకి అడుగుపెట్టింది ఈ విడా వీఎక్స్​2. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి వీఎక్స్‌2 గో, వీఎక్స్‌2 ప్లస్. విడా వీఎక్స్‌2 రెండు వేరియంట్లు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో క...