భారతదేశం, నవంబర్ 11 -- బిహార్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో ఓటింగ్‌కు అదనపు సమయాన్ని కేటాయిస్తామని ఎన్నికల సంఘ స్పష్టం చేసింది. కాగా దిల్లీ పేలుడు నేపథ్యంలో బిహార్‌లో అప్రమత్తమైన అధికారులు.. ఎన్నికల వేళ భద్రతను మరింత పెంచారు.
నవంబర్ 6న జరిగిన బిహార్ ఎన్నికల తొలి దశ పోలింగ్ 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాలను కవర్ చేసింది. ఇందులో 65.08% ఓటింగ్ నమోదైంది. ఇది బిహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం కావడం విశేషం. అయితే ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్ఐఆర్) కారణంగా మొత్తం ఓటర్ల సంఖ్య 7.89 కోట్ల నుంచి 7.42 కోట్లకు తగ్గడం గమనార్హం.
ఇక మంగళవారం మొత్తం 20 జిల్లాల పరిధిలోని 122 అసెంబ్లీ నియో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.