Hyderabad, జూన్ 30 -- కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్‌కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచనే ఈ దిల్ రాజు డ్రీమ్స్. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్‌ని లాంచ్ చేస్తున్నాం' అన్నారు నిర్మాత దిల్ రాజు.

ఇటీవల దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరై దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్‌ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. 13 ఏళ్ల క్రితం పొద్దున లేచిన వెంటనే ఐడియల్ బ్రెయిన్ డాట్ కామ్ (id...