Hyderabad, జూన్ 11 -- జూన్ 15వ తేదీన సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తాడు. దీంతో ప్రత్యేకమైన త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. గురువు కూడా చాలా కాలం తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 12 ఏళ్ల తర్వాత మిథున రాశిలో ఈ యోగం ఏర్పడనుంది. సూర్యుడు బుధుని కలయికతో బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది.

బుధుడు సొంత రాశిలో ఉంటాడు కనుక భద్ర యోగం ఏర్పడుతుంది. అదే విధంగా, సూర్యుడు గురువు కలయిక ఆదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ శక్తివంతమైన యోగాల వలన కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది.

వృషభ రాశి రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో వృషభ రాశి వారికి అనేక లాభాలు అందుతాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి పూర్వికుల ఆస్తి లభించే అవకాశం ఉంది. శుభకార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం ఇప్పుడు వస్తుంది. మీరు మీ ప్రసంగాలతో...