Hyderabad, జూన్ 26 -- ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర జూన్ 20న థియేటర్లలో విడుదలై దూసుకుపోతోంది. తాజాగా కుబేర ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

కుబేర వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిందని ఉన్న పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్ చేశారు. అయితే, కుబేర సినిమాలో దేవ అనే బిచ్చగాడి పాత్రలో అదరగొట్టిన ధనుష్ తన సినీ కెరీర్‌లో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ సాధించడం ఇది నాలుగోసారి.

మొదటిసారి ధనుష్ 2022లో తిరు మూవీతో వంద కోట్లు అందుకున్నాడు. ఆ తర్వాత 2023లో తెలుగులో చేసిన సార్ సినిమాకు రూ. 100 కోట్లు వచ్చాయి. అనంతరం గతేడాది అంటే 2024లో తన సొంత దర్శక...