భారతదేశం, జూలై 6 -- ఒకప్పుడు పెన్నీ స్టాక్‌గా ఉన్న ఎలైట్‌కాన్ ఇంటర్నేషనల్ షేర్లు దాదాపు రూ. 1 స్థాయి నుంచి ప్రస్తుతం రూ. 75కు పైగా పెరిగాయి. ఇక ఇప్పుడు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వారం బోర్డు సమావేశం జరగనుందని, ఇందులో సుమారు రూ. 300 కోట్ల నిధుల సమీకరణ, ప్రిఫరెన్షియల్​ షేర్ల జారీ, ఒక విదేశీ కంపెనీని కొనుగోలు చేయడం వంటి కీలక వ్యాపార అంశాలపై చర్చించనున్నట్లు తెలిపింది.

ఎలైట్‌కాన్ ఇంటర్నేషనల్, ఎక్స్​ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్న ప్రకారం.. బోర్డు సమావేశం జులై 9, బుధవారం జరగనుంది. ఫైలింగ్‌లోని వివరాల ప్రకారం, కంపెనీ బోర్డు ఒక విదేశీ వ్యాపార సంస్థను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తుంది.

అదనంగా, ఈ పెన్నీ స్టాక్ బోర్డు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ. 300 కోట్ల నిధుల సమీకరణ విషయాన్ని కూడా చేపడుతుంది.

"కంపెనీ సభ్యుల ఆమోదం...