భారతదేశం, ఆగస్టు 12 -- శిక్షాకాలాన్ని పూర్తిచేసినప్పటికీ ఇంకా జైళ్లల్లో ఉండిపోయిన ఖైదీలను వెంటనే విడిచిపెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలిచ్చింది. నితీశ్​ కటారా మర్డర్​ కేసు దోషి సుఖ్​దేవ్​ యాదవ్ అలియాస్​ హెహల్వాన్​ దాఖలు చేసిన​ వ్యాజ్యంపై విచారణ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

లైవ్‌లా రిపోర్ట్ ప్రకారం.. ఈ దోషులు మరే ఇతర కేసుల్లో నిందితులు కానట్లయితే, వారిని వెంటనే విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. సుఖ్‌దేవ్ పెహల్వాన్ క్షమాభిక్ష లేకుండానే తన శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్నందున, అతడిని విడుదల చేయాలని ఆదేశించింది.

ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హోం సెక్రటరీలకు పంపాలని కోర్టు...