భారతదేశం, ఆగస్టు 19 -- ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్​స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైట్‌హౌస్‌లో జెలెన్​స్కీ, యూరోపియన్ దేశాల నాయకులతో విస్తృత చర్చల అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫారంలో మాట్లాడుతూ.. వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు, యూరోపియన్ నాయకులతో "చాలా మంచి" సమావేశం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. "సమావేశాలు ముగిసిన వెంటనే, నేను అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి, ఒక నిర్ణీత ప్రదేశంలో పుతిన్- జెలెన్​స్కీల మధ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాను," అని ట్రంప్ పేర్కొన్నారు.

జెలెన్​స్కీని కలవడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నారని...