భారతదేశం, జూలై 29 -- ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో మే 9న పాకిస్థాన్ ప్రయోగించిన 1,000 క్షిపణులు, డ్రోన్లను భారత సాయుధ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ''పాక్ క్షిపణులు, డ్రోన్లను మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేశాయి. మే 9న భారత్ పై 1000 క్షిపణులు, డ్రోన్లను పాక్ ప్రయోగించింది. కానీ అవన్నీ గాలిలోనే ధ్వంసమయ్యాయి'' అని మోదీ అన్నారు.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తరువాత భారత్ చేపట్టినన ఆపరేషన్ సిందూర్ పై జరిగిన రెండు రోజుల చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధాని మోదీ మంగళవారం రాత్రి ప్రసంగించారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ కచ్చితమైన దాడులు చేసిందని పేర్కొంటూ సాయుధ దళాల నిర్ణయాత్మక ప్రతిస్పందనను ప్రధాన మంత్రి ప్రశంసించారు.

''ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా 22 నిమిషాల్...