భారతదేశం, నవంబర్ 14 -- బీహార్‌లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన 74ఏళ్ల నితీశ్​ కుమార్, దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో ఎన్డీఏ పాలనకు కేంద్రంగా ఉన్నారు. 2025 బీహార్​ ఎన్నికల్లో నితీశ్​ భారీ విజయం దిశగా దూసుకెళుతుండటంతో.. 'సుశాసన్ బాబు' (మంచి పాలన అందించే బాబు) తన పట్టును నిలుపుకున్నారు. ఎన్ని క్లిష్టపరిస్థితులు ఎదురైనా, ఎన్ని అనుమానాలు వెల్లువెత్తినా, రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఆయన ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

నితీశ్​ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) పార్టీ, ఐదేళ్ల క్రితం (2020లో) దారుణమైన పనితీరును నమోదు చేసినప్పటికీ, తాజా ఎన్నికల్లో తన సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధంగా ఉంది. దీనికి ప్రధానంగా మహిళలు, అత్యంత వెనుకపడిన కులాలు, దళితుల నుంచి నిరంతర మద్దతు లభించడమే కారణం.

20...