భారతదేశం, జనవరి 5 -- భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 'టారిఫ్' అస్త్రాన్ని ప్రయోగించారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న అంశంపై భారత్ వెనక్కి తగ్గకపోతే, ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాలను మరింత పెంచుతామని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదించింది.

రష్యాతో భారత్ జరుపుతున్న చమురు వ్యాపారాన్ని ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ కారణం చూపే గత ఏడాది (ఆగస్టు 2025) భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను రెట్టింపు చేస్తూ 50 శాతానికి పెంచారు.

ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. "రష్యా ఆయిల్ విషయంలో భారత్ మాకు సహకరించకపోతే, వారిపై మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉంది," అని ట్రంప్ స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీని కూడా ట్రంప్​ ప్రస్తావించారు.

"మోదీ మంచి వారు. నేను సంత...