భారతదేశం, జూన్ 17 -- ఇమ్మిగ్రేషన్​ రేటు తక్కువ ఉన్న దేశాల నుంచి వస్తున్న వారికి 'డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్​ వీసీ' (డీవీ) ప్రోగ్రామ్​ ద్వారా 55వేల ఇమ్మిగ్రెంట్​ వీసాలను అమెరికా ప్రతియేటా అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్​కి డీవై లాటరీ లేదా గ్రీన్​ కార్డ్​ లాటరీ అన్న పేర్లు ఉన్నాయి. అసలేంటి గ్రీన్​ కార్డ్​ లాటరీ? అర్హత ఏంటి? భారతీయులు అప్లై చేయవచ్చా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

గ్రీన్​ కార్డ్​ లాటరీ పద్ధతిలో ప్రతియేటా 55వేల మందికి అమెరికా శాశ్వత నివాసాన్ని మంజూరు చేస్తుంది.

అమెరికా గ్రీన్​ కార్డ్​ లాటరీ డ్రాలో మీరు పేరు పిక్​ అయిన వెంటనే శాశ్వత నివాస హోదా దక్కదు! దీని తర్వాత ఇంకాస్త ప్రాసెస్​ ఉంటుంది.

గత 5ఏళ్లల్లో ఏ దేశం నుంచైతే 50వేల మందికిపైగా వలసదారులు అమెరికాలోకి వచ్చి ఉంటారో, ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఈ గ్రీన్​ కార్డ్​ లాటరీలో...