భారతదేశం, జూలై 19 -- ఇప్పుడు ప్రపంచ నెటిజెన్లు అందరు ఆస్ట్రానమర్​ సీఈఓ ఆండీ బైరన్​, హెచ్​ఆర్​ చీఫ్​ క్రిస్టిన్​ కాబొట్ గురించే మాట్లాడుకుంటున్నారు! కోల్డ్​-ప్లే కాన్సర్ట్​లో వీరి వివాహేతర బంధం బయటపడటంతో ఆ వీడియోలు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకో అనుకోని విషయం బయటకు వచ్చింది! వీరిద్దరి వ్యవహారం.. పోర్న్​హబ్​లో కొన్ని అడల్ట్​ కంటెంట్​ శోధనలను పెంచేసింది! ఈ విషయాన్ని టీఎంజెడ్​ వెబ్​సైట్​ నివేదించింది. వీరి 'కిస్ క్యామ్' వివాదం బయటపడినప్పటి నుంచి "చీటింగ్​", "అఫైర్​" కోసం శోధనలు 19శాతం పెరిగాయని ఈ ప్రచురణ అడల్ట్ సైట్ నుంచి అంతర్గత డేటాను ఉటంకిస్తూ తెలిపింది.

బైరన్, కాబొట్‌లు కోల్డ్‌ప్లే జిల్లెట్ స్టేడియం కన్సర్ట్ సందర్భంగా ఒకరినొకరు కౌగిలించుకుంటూ 'కిస్​ కామ్'​కి దొరికిపోయారు. వీరి మధ్య అఫైర్​ నడుస్తున్నట్టుంది అని క...