భారతదేశం, డిసెంబర్ 26 -- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గారు అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేకనే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ భవన్ లో చేరికల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. "మొన్న కేసీఆర్ గారు ఏమడిగారు? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు పండపెట్టినవు అని అడిగారు. ఎనిమిది నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను వెనక్కి పంపినా, దానిని మళ్ళీ పంపి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే సోయి ఈ ముఖ్యమంత్రికి ఉందా? 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుపై ఇంకొక పది పైసలు ఖర్చు పెడితే పాలమూరుకు నీళ్లు వస్తాయి, ఆ పని చేయమని అడగడం తప్ప...