భారతదేశం, అక్టోబర్ 9 -- భారత శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్‌లో వ్యాపార పోరు కాస్తా రాజకీయ రణరంగంగా మారింది! నిబంధనలన్నీ పాటిస్తున్నా ఐదేళ్లుగా భారత్‌లో తమ 'స్టార్‌లింక్' సేవలకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేరును నేరుగా ప్రస్తావిస్తూ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ప్రపంచవ్యాప్తంగా 165 కంటే ఎక్కువ దేశాల్లో స్టార్‌లింక్ విజయవంతంగా లైసెన్సులు పొంది సేవలు అందిస్తోందని ఎలాన్ మస్క్ గుర్తు చేశారు. భారత్‌లో ప్రవేశించడానికి ఐదేళ్లుగా ఇక్కడి చట్టాలు, ప్రభుత్వ నిబంధనలకు సంపూర్ణంగా కట్టుబడి ఉన్నామని చెప్పారు.

"ఇన్ని చేసినా మాకు ఇంకా లైసెన్స్ ఎందుకు రాలేదు? భారత్‌కు అసలైన బాస్ అంబానీనా?" అని సోషల్ మీడియా వేదికగా మస్క్ నేరుగా ప...