భారతదేశం, డిసెంబర్ 18 -- రాష్ట్రంలోని ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడంలో తనదైన ముద్ర వేసుకున్న హౌసింగ్ బోర్డు. మరో శుభవార్తతో ముందుకొచ్చింది. ప్రత్యేకంగా ఎల్ఐజీ వర్గాల (లోయర్ ఇన్ కమ్ గ్రూప్) కోసం ఫ్లాట్లను (Flats) అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లోని మొత్తం 339 ఫ్లాట్లను అందుబాటులోని ధరలతో విక్రయిస్తోంది.

అల్పాదాయ వర్గాల ప్రజలకు (ఎల్ఐజీ) మంచి వసతులతో కూడిన సొంత ఇంటి వసతిని కల్పించాలన్న ఉద్దేశ్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే అనేక కుటుంబాలు నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ - అపార్ట్ మెంట్ లలోని ఫ్లాట్లను ఆ వర్గాలకు చెందిన వారికే కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన.. అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ఫ్లాట్...