భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఈ ఫిబ్రవరి 2026లో కొత్త కారు తీసుకునే ప్లాన్​లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే! దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా.. తన పోర్ట్​ఫోలియోలోని కొన్ని మోడల్స్​పై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. వీటి ద్వారా మీరు గరిష్ఠంగా రూ. 1.97 లక్షల వరకు పొదుపు చేసే అవకాశం ఉంటుంది! ఈ ఆఫర్లలో క్యాష్​ డిస్కౌంట్​, ఎక్స్​ఛేంజ్/స్క్రాపేజ్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోండా కార్లు, వాటిపై లభిస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1. హోండా ఎలివేట్

తగ్గింపు: రూ. 1.48 లక్షల వరకు.

ఇండియాలో హోండాకి ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీ ఈ ఎలివేట్​.

ఈ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలో హోండా సిటీ పెట్రోల్ ఇంజనే ఉంటుంది. ఇది మార్కెట్​లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా సియెర్రా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి కార...