భారతదేశం, డిసెంబర్ 26 -- హైదరాబాద్ నగరంలోని నల్లకుంట పరిధిలో దారుణం వెలుగూ చూసింది. కుటుంబ కలహాలతో భార్యను భర్త హతమార్చాడు. తీవ్రంగా దాడి చేయటమే కాకుండా.. ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. మంటల దాటికి భార్య మృతి చెందగా. ఈ ఘటనలో కుమార్తె కూడా గాయపడింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేశ్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉండగా. ప్రస్తుతం నగరంలోని నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం పాటు బాగానే ఉన్నప్పటికీ. ఆ తర్వాత భార్యపై వెంకటేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఏదో ఓ రకంగా వేధిస్తూ గొడవపడేవాడు. ఇటీవలే భర్త వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత త్రివేణిని భర్త వెంకటేశ్ తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చాడు.

ఎప్పటిలాగే మరోసారి భార్యతో గొడవపడిన వెంకటేశ్. త్రివేణిపై ...