భారతదేశం, డిసెంబర్ 17 -- హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఆదేశించారు. ఎల్ అండ్ టీ అధికారులతో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.టేకోవర్ తాజా స్థితిని సమీక్షించిన ఆయన.ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా బదిలీ సజావుగా మరియు వేగంగా జరగాలని ఉద్ఘాటించారు.

ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియ కొనసాగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. రాబోయే 100 రోజుల్లో ప్రణాళికాబద్ధమైన విధానాలను క్రమపద్ధతిలో తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎల్ అండ్ టి పూర్తి సహకారం అందించాలని కోరారు.

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ ఎంఆర్ ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఆపరేషన్స్ అ...