భారతదేశం, మార్చి 5 -- హైదరాబాద్ సిటీలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనంపై నుంచి పడిపోయి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. భవన నిర్మాణ పనులు చేస్తుండగా పరందా కూలిపోవటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ సహాయక చర్యలు చేపట్టింది.

ఈ ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రక్షణ చర్యలు చేపట్టడం, గాయపడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించే విషయంలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.

Published by HT Digital Content Services with permission from...