భారతదేశం, మార్చి 5 -- హైదరాబాద్ సిటీలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనంపై నుంచి పడిపోయి నలుగురు కార్మికులు మృతి చెందారు. భవన నిర్మాణ పనులు చేస్తుండగా పరందా కూలిపోవటంతో ఈ ఘటన చోటు చేసుకున్న తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ సహాయక చర్యలు చేపట్టింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....