భారతదేశం, మార్చి 26 -- క్రికెట్ అభిమానులకు బీసీసీఐ ఒక అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్న టీమిండియా 2026-27 హోమ్ సీజన్ పూర్తి షెడ్యూల్‌ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా గురువారం (మార్చి 26) అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ కొత్త సీజన్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఏకంగా 17 వేదికల్లో 22 మ్యాచ్‌లు ఆడబోతోంది. వీటిలో అక్టోబర్ 14న వెస్టిండీస్ తో టీ20, జనవరి 6న జింబాబ్వేతో వన్డే మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుండటం విశేషం.

ముందుగా ఈ సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌తో ఈ హోమ్ సీజన్ చాలా గ్రాండ్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ టూర్‌లో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడి వచ్చిన వెంటనే.. మళ్లీ మన ఇండియాలో మ్యాచ్‌ల పండగ మొదలవుతుంది. ఈ సీజన్‌లో అందరూ ఎం...